![]() |
![]() |
.webp)
కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ వంటలక్క గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వంటలక్క అసలు ప్రేమి విశ్వనాధ్. వంటలక్క ఏడిస్తే ఆడియన్స్ కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వంటలక్క నటించిన కార్తీక దీపం సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఐతే వంటలక్క రియల్ లైఫ్ లో మలయాళం నటుడు జయసూర్యకు చుట్టం అన్న విషయం తెలుసా. ఐతే ఈ విషయాన్ని వంటలక్క ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం ఎపిసోడ్ లో చెప్పింది. ఈ షోలో "జింగ్ జింగ్ అమేజింగ్" అనే సెగ్మెంట్ లో హుడి అనే మెంటలిస్ట్ వచ్చి కాసేపు గేమ్స్ ఆడించాడు. ఐతే అందులో వంటలక్క క్రష్ ఎవరో మనసులో తలుచుకోమని చెప్పాడు. చివరికి తన మ్యాజిక్ ద్వారా వంటలక్క క్రష్ పేరు జయసూర్య అని రివీల్ చేసాడు.
ఐతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలీదని చెప్పింది వంటలక్క. జయసూర్య- వంటలక్కకు కజిన్ వరస అవుతాడని ఐతే ఆమె జయసూర్యనే పెళ్లి చేసుకోవాల్సింది కానీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వినీత్ భట్ ని చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఐతే సీరియల్స్ ఎంపిక విషయంలో జయసూర్య తనకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారన్న విషయాన్ని గతంలో చెప్పింది. వంటలక్క ప్రముఖ జ్యోతిష్కుడైన వినీత్ భట్‌ను పెళ్లి చేసుకుంది. మాస్కోలోని రష్యన్ పార్లమెంట్‌లో జ్యోతిష శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఆయనకు "బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్ 2017" అవార్డును కూడా గెలుచుకున్నారు. కేరళ ప్రజలు అతన్ని తిరుమేని అని కూడా పిలుస్తారు. ఇక వంటలక్కకు ఒక బాబు కూడా ఉన్నాడు. వంటలక్క అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. 2019 లో వచ్చిన గోరింటాకు, 2020 లో వచ్చిన చెల్లెలి కాపురం (2020) వంటి తెలుగు సీరియల్స్‌లో కనిపించింది. అలాగే ఫేమస్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. ఇక జయసూర్య మలయాళంలో అద్భుతమైన మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి.
![]() |
![]() |